ఉనికి (UNIKI)/ BHAASHAA WORKS వ్యవస్థాపకుడు విరియాల హరీశ్ గురించి:

భారతీయ భాషల (తెలుగు, హిందీ)లో మొట్టమొదటి స్క్రాబుల్ (Scrabble) లాంటి కట్టుడు బిళ్ళలతో ఆడే పదబంధ క్రీడల సృష్టికర్త; ఈ ఆటలని రూపొందించే సంస్థల వ్యవస్థాపకుడు; బడి పిల్లలని ఉత్సాహపరిచి, ఆకట్టుకున్న వినూత్నమైన తెలుగు మాటల ఆటల పోటీలను హైదరాబాదు, విశాఖపట్నాలలో సమర్థవంతంగా నిర్వహించినవాడు.


భారతీయ ప్రౌద్యోగికి సంస్థ (చెన్నై) నుండి సాంకేతిక స్నాతక విద్య పట్టభద్రుడు (బీ.టెక్., IIT మద్రాస్)), అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి క్రీడా నిర్వహణ, సామాజిక శాస్త్రాంతర స్నాతకోత్తర విద్య పట్టభద్రుడు (Interdisciplinary master's in Sport Administration & Social Sciences, USA); పదాల ఆటల ప్రవీణుడు; సామాజిక-భాషావేత్త; లాటిన్ లిపిపై ఆధారపడకుండా INSCRIPT కీబోర్డ్ పై వేగంగా టైప్ చెయ్యడం; పరిశోధనతో కూడిన వ్యవస్థాపక దృష్టి; కొన్ని గంటల్లో తమిళం, కొరియన్ లిపులను ఎలా చదవాలో/రాయాలో కనుగొన్నారు; ప్రపంచ వ్యాప్తంగా 30 లిపులు పైగా చదవడం/వ్రాయడం లేదా ఖచ్చితంగా పోల్చగలిగే సామర్థ్యం ఉన్నవారు.


ఇతర అభిరుచులు: తెలుగు లిపిని, రచనా విధానాన్ని సరళీకరించడం, సులభతరంగా వాటిని ప్రజలతో అవలంబింపజేసి, సార్వజనీనం చేయడం (డిజిటల్ పరికరాలలో కూడా); దక్షిణ కొరియా, తైవాన్, జర్మనీ, థాయిలాండ్, ఫిన్లాండ్ వంటి ప్రాంతాల నుండి ప్రేరణ పొంది, నిత్యజీవితంలో ఉన్నత ప్రమాణాలున్న తెలుగు వాడుక వ్యాప్తి కోసం పర్యావరణ వ్యవస్థను (ecosystem) సృష్టించే ప్రయత్నాలు చెయ్యడం.